Suicide : ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

Suicide : ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
X

తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని కొత్తపేటలో జరిగింది. ఏపీలోని ఒంగోలుకు చెందిన గంజి పద్మ(40), ఆమె కొడుకు వంశీ(18) కొన్నేళ్లుగా చైతన్యపురి పీఎస్ పరిధి కొత్తపేటలోని ఎస్‌ఆర్‌ కాలనీలో రెంట్ కు ఉంటున్నారు. పద్మ భర్త శివ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతిని తట్టుకోలేక వంశీ ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story