Tamil Nadu: ఇద్దరు కూతుళ్లను నీటితొట్టిలో తోసిన తల్లి.. ఆపై తాను కూడా..

Tamil Nadu: ఇద్దరు కూతుళ్లను నీటితొట్టిలో తోసిన తల్లి.. ఆపై తాను కూడా..
X
Tamil Nadu: మంగళవారం రాజమ్మాల్ గుడికి వెళ్లి తిరిగొచ్చే సరికి ఇద్దరు పిల్లలు నీటితొట్టిలో శవాలుగా ఉన్నారు.

Tamil Nadu: ఇద్దరు కూతుళ్లను నీటితొట్టిలో పడేసి.. తాను కూడా ఉరేసుకొని మృతిచెందింది ఓ తల్లి. కనీసం ఊహ కూడా రాని ఆ ఇద్దరు పిల్లలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కుళితురై సమీపంలోని కలువన్‌ దిట్ట కాలనీ ప్రాంతానికి చెందిన జబషైన్‌‌.. కేరళలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడి భార్య విజి, ఇద్దరు కూతుళ్లతో కలిసి కన్యాకుమారిలోనే జబషైన్‌ తల్లితో ఉంటుంది. జబషైన్‌ ఇద్దరు కూతుళ్లు ప్రియ(2), ఇంకొక ఆరు నెలల చిన్నారిని చూసుకుంటూ తల్లి రాజమ్మాల్‌ వారితోనే ఉంటుంది.

మంగళవారం రాజమ్మాల్ గుడికి వెళ్లి తిరిగొచ్చే సరికి ఇద్దరు పిల్లలు నీటితొట్టిలో శవాలుగా ఉన్నారు. లోపలికి వెళ్లి చూస్తే.. విజి ఉరేసుకుని కనిపించింది. ముగ్గురి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు.

Tags

Next Story