అమ్మే ఇలా చేస్తే ఎలా.. కుమారుడు సీఏ పరీక్షలో తప్పాడని..

అమ్మే ఇలా చేస్తే ఎలా.. కుమారుడు సీఏ పరీక్షలో తప్పాడని..
చదువు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. కావచ్చు.. చదువే మన జీవితాన్ని నిర్ధేశిస్తుంది అంటే ఒక్కోసారి నిజం కాకపోవచ్చు.

చదువు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.. కావచ్చు.. కానీ చదువే మన జీవితాన్ని నిర్ధేశిస్తుంది అంటే ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ఎంత చదువు చదివినా ఆఖరికి నిన్ను నిలబెట్టేది నీపై నీకు ఉన్న నమ్మకం మాత్రమే.. ఆ విషయం అమ్మకు ఆ మాత్రం ఎందుకు తెలియకుండా పోయింది. కొడుక్కి పరీక్షల్లో మార్కులు తక్కువొస్తే ఓదార్చాల్సింది పోయి తనే నీరుగారి పోయింది, ప్రాణాలు తీసుకుంది. మంచి చెడు ఆ కొడుక్కి ఇంకెవరు చెబుతారు.. ఇది కాకపోతే ఇంకొటి చదవొచ్చు. ఇదొక్కటే కాదు అని చెప్పడానికి అమ్మ లేదు.. అసలు ఆమె తీసుకున్న నిర్ణయమే సరిగా లేదు.

జీడిమెట్ల పరిధిలోని గాజులరామారంలో నివసించే నాగభూషణం, పుష్పజ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. భర్త ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా భార్య గృహిణి. ఇటీవల ఓ కుమారుడు సీఏ పరీక్షలు రాశాడు. కానీ అందులో ఉత్తీర్ణత సాధించలేదు. దాంతో తల్లి మానసికంగా కుంగిపోయింది. కుమారుడి భవిష్యత్తుపై బెంగపెట్టుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకువెళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story