మాటలు ఒకలా, చేతలు మరోలా.. మోటివేషనల్ స్పీకర్ పెళ్లయిన 8 రోజులకే భార్యను..

మాటలు ఒకలా, చేతలు మరోలా.. మోటివేషనల్ స్పీకర్ పెళ్లయిన 8 రోజులకే భార్యను..
మాటే మంత్రం.. అవును కదా.. ఒక్క మాట చాలు మారిపోవడానికి. అంతగా ప్రభావం చూపిస్తాయి మాటలు. ఆయన మాటలు కూడా అంతే.. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఉంటాయి.

మాటే మంత్రం.. అవును కదా.. ఒక్క మాట చాలు మారిపోవడానికి. అంతగా ప్రభావం చూపిస్తాయి మాటలు. ఆయన మాటలు కూడా అంతే.. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఉంటాయి. ఆ క్షణంలో మారిపోవాలనిపిస్తాయి. అంతబాగా మాట్లాడుతారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు నిజంగానే ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తారు. అందరికీ చెబుతారు కానీ వారు ఆచరించరా.. అందరి విషయంలో కాకపోవచ్చు. కానీ వివేక్ బింద్రా విషయంలో మాత్రం ఇది నిజమని నిరూపించింది. అతడితో జీవితం పంచుకుందామని వచ్చిన భార్యకు పెళ్లైన వారం రోజుల్లోపే తన నిజస్వరూపం ఏంటో నిరూపించాడు.

భార్య యానికా బింద్రాపై దాడి చేసినందుకుగాను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రాపై దాడి కేసు నమోదైంది. వివేక్, యానిక డిసెంబర్ 6, 2023 న వివాహం చేసుకున్నారు. అయితే, అతనిపై డిసెంబర్ 14 న నోయిడా సెక్టార్ 126 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. బాధితురాలి సోదరుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాడు.

ఫిర్యాదులో, వివేక్ బింద్రా తన తల్లితో వాగ్వాదానికి పాల్పడుతుండగా తన సోదరి జోక్యం చేసుకుందని.. దాంతో వారి మధ్య గొడవ జరిగిందని బాధితురాలి సోదరుడు పేర్కొన్నాడు. తన సోదరిని గదిలోకి లాక్కెళ్లి, దుర్భాషలాడాడని, ఆమెపై తీవ్రమైన శారీరక దౌర్జన్యం చేశాడని, ఫలితంగా ఆమె శరీరమంతా గాయాలు అయ్యాయని ఆరోపించాడు.

యానిక శరీరం మొత్తం గాయాలు కాగా ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది అని తెలిపాడు. ఆమె చెవిలో గాయం కారణంగా వినికిడి సమస్య తలెత్తిందని పేర్కొన్నాడు. దాడి సమయంలో నిందితుడు తన సెల్‌ఫోన్‌ను కూడా పగలగొట్టాడని ఫిర్యాదుదారు తెలిపారు. దీనిపై నోయిడా పోలీసులు విచారణ ప్రారంభించారు.

ప్రముఖ యూట్యూబర్, మోటివేషనల్ స్పీకర్ మరియు బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ (BBPL) CEO అయిన బింద్రాకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం, అతను ఒక స్కామ్‌లో కేంద్రంగా ఉన్నాడు. ఇందులో అతని ప్రమేయాన్ని మరొక ప్రేరణాత్మక స్పీకర్ మరియు యూట్యూబర్ సందీప్ మహేశ్వరి ఫ్లాగ్ చేశారు.

మహేశ్వరి తన యూట్యూబ్ ఛానెల్‌లో “బిగ్ స్కామ్ ఎక్స్‌పోజ్” పేరుతో ఒక వీడియోను విడుదల చేశాడు. దీనిలో అతను బింద్రా కంపెనీచే మోసపోయామని పేర్కొన్న విద్యార్థుల సాక్ష్యాలు ఉన్నాయి. అయితే, బింద్రా అన్ని ఆరోపణలను ఖండించారు. మీరు ఒక వైపే వింటున్నారు.. మరో వైపు కూడా వినమని మహేశ్వరికి సలహా ఇచ్చారు.

Tags

Next Story