Crime News: భర్తతో గొడవపడి.. నలుగురు పిల్లలతో బావిలో దూకి..

Crime News: భర్తతో గొడవపడి.. నలుగురు పిల్లలతో బావిలో దూకి..
Crime News: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ ఆదివారం తన నలుగురు పిల్లలను బావిలోకి తోసి. తాను కూడా దూకింది.

Crime News: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ ఆదివారం తన నలుగురు పిల్లలను బావిలోకి తోసి. తాను కూడా దూకింది. ప్రమీలా భిలాలా అనే మహిళ తన భర్త రమేష్‌తో గొడవపడిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. అయితే, నీటిలో పడిపోవడంతో మహిళ ప్రాణ భయంతో తన పెద్ద కుమార్తెతో సురక్షితంగా పైకి ఎక్కేందుకు బావిలోకి వేలాడుతున్న తాడును పట్టుకుంది. కానీ అప్పటికే మిగిలిన ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అందులో 18 నెలల కుమారుడుతో సహా, వరుసగా మూడు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుర్హాన్‌పూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్ది గ్రామంలో ఈ ఘటన జరిగిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ కుమార్ తెలిపారు. ప్రమీల, ఆమె 7 ఏళ్ల కుమార్తె పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story