Mumbai : రైల్వే వంతెన కింద నివసిస్తోన్న యువతిపై అత్యాచారం

నిలువ నీడ లేక రైల్వే బ్రిడ్జి కింద నివసిస్తోన్న 17 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని పలు మార్లు అత్యాచారం చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ముబైంలోని 'సన్ పాడా' రైల్వే స్టేషన్ బ్రిడ్జి కింద 17ఏళ్ల యువతి నివసిస్తోంది. ఒంటరి మహిళను మాయ మాటలు చెప్పి 21 ఏళ్ల ఓ వ్యక్తి దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. జీవితానికి ఒక దారి దొరుకుతుందనుకున్న యువతి అతన్ని నమ్మింది.
యువతి నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న దుండగుడు గత డిసెంబర్ నుంచి పలు మార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే పెళ్లి చేసుకోమని అడగ్గా అతడు ముఖం చాటేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com