Mumbai : మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులు అరెస్ట్

Mumbai : మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులు అరెస్ట్


మైనర్ బాలికను రేప్ చేశారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన మహారాష్ట్ర లోని పాల్గర్ లో జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నిందితులను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఓ మైనర్ బాలిక తన మైనర్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి బుధవారం సాయంత్రం ఇంటికి దగ్గరలో ఉన్న హిల్ ప్రాంతానికి వాకింగ్ కు వెళ్లారు. అక్కడే మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులు (22, 25 వయసుగల) మైనర్ బాలికను కామెంట్ చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మైనర్ బాలుడి బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు.


ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మార్చి 27వరకు నిందితులకు రిమాండ్ ను విధించారు న్యాయమూర్తి. గ్యాంగ్ రేప్ జరిగినట్లు కేసు నమోదు చేశారు. బాధితులు ముంబై శివారు ప్రాంతమైన విరార్ లోని సాయినాథ్ నగర్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

Read MoreRead Less
Next Story