Mumbai : ప్లాస్టిక్ బ్యాగ్ లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం

Mumbai : ప్లాస్టిక్ బ్యాగ్ లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం
X
మృతురాలి కూతరుని(22) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

ప్లాస్టిక్ బ్యాగ్ లో కుళ్లిపోయిన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలో జరిగింది. మహిళ మయస్సు 53 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం లాల్ బాగ్ ప్రాతంలో వాకింగ్ కు వెళ్లిన వ్యక్తులకు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


మృతురాలి కూతరుని(22) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ ప్రవీణ్ ముండే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతి చుట్టూ పలు అనుమానాలు ఉండటంతో కేసును జాగ్రత్తగా విచారిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story