Mumbai: కోటి మందిని చంపేస్తామని పోలీసులకు బెదిరింపు సందేశం.. వ్యక్తి అరెస్ట్..

నోయిడాలోని గణేష్ పండుగ వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో డజన్ల కొద్దీ పేలుళ్లు జరుగుతాయని బెదిరిస్తూ, ముంబై పోలీసులకు సందేశం పంపించాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.
14 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు 34 వాహనాల్లో 400 కిలోగ్రాముల ఆర్‌డిఎక్స్‌తో నగరంలోకి ప్రవేశించారని ఆ సందేశం సారాంశం. శనివారం 10 రోజుల గణేష్ చతుర్థి పండుగ ముగింపు సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సమయంలో పోలీసులు ఆ సందేశాన్ని చూసి ఒక్కసారిగా ఆందోళన చెందారు.
ఈ సందేశం పంపిన వ్యక్తిని పాట్నా నివాసి అశ్వినికుమార్ సురేష్‌కుమార్ సుప్రాగా గుర్తించారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. తరువాత అతన్ని ముంబై పోలీసులకు అప్పగించారు.
అశ్వినికుమార్ ఒక జ్యోతిష్కుడు అని వర్గాలు తెలిపాయి. బెదిరింపు సందేశంలో 'లష్కర్-ఎ-జిహాదీ' అనే సంస్థ పేరును పంపిన వ్యక్తి ప్రస్తావించాడని ముంబై పోలీసులు తెలిపారు. "ట్రాఫిక్ పోలీసులకు గతంలోనూ ఇలాంటి బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి. భయపడాల్సిన అవసరం లేదు. కీలక ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు మరియు కూంబింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అని ఒక అధికారి తెలిపారు.
బెదిరింపు సందేశం గురించి ఉగ్రవాద నిరోధక దళానికి కూడా సమాచారం అందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా ఇది బూటకమని అనిపిస్తుంది, కానీ సాంకేతిక విశ్లేషణ సహాయంతో పోలీసులు సందేశం యొక్క మూలాన్ని పరిశీలిస్తున్నారని అధికారి తెలిపారు. నిమజ్జనం రోజున రోడ్లపై జనసందోహం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా ఆయన చెప్పారు. విగ్రహ నిమజ్జన సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి నగరంలో 21,000 మందికి పైగా పోలీసులను మోహరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com