Nagendra Trading Company : వరంగల్‌లో 10 కోట్ల రూపాయలతో ఉడాయించిన వ్యాపారి

Nagendra Trading Company : 10 కోట్ల రూపాయలతో వ్యాపారి ఉడాయించిన ఘటన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో చోటుచేసుకుంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిత్యం వేలాది మంది రైతులు పంట ఉత్పత్తులను విక్రయించేందుకు వస్తుంటారు. ఇక్కడ 450 మంది దాకా ఆడితిదారులు ఉన్నారు. వీరితోనే మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరుగుతుంటాయి, రైతులు తీసుకవచ్చిన పంటను ఆడితి దారులు మధ్య వర్తిత్వం వహించి కొనుగోలుదారులకు విక్రయిస్తుంటారు. ఈనేపథ్యంలో స్థానిక నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ.. ఆడితి దారుల నుంచి 10 కోట్ల వరకు మిర్చి కొనుగోలు చేసింది. కాగా గత రెండు రోజులుగా నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ కి చెందిన యజమానులు కనబడటం లేదు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆడితిదారులు న్యాయం చేయాలని మార్కెట్ కార్యలయం మందు బైఠాయించారు. తమను ఆదుకోవాలని ఆడితి దారుల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com