Crime News: టీడీపీ కార్యకర్త ఇబ్రహీం హత్యతో రగులుతున్న పల్నాడు..

Crime News: టీడీపీ కార్యకర్త ఇబ్రహీం హత్యతో రగులుతున్న పల్నాడు..
Crime News: టీడీపీ కార్యకర్త ఇబ్రహీం హత్యతో పల్నాడు జిల్లా రగిలిపోతోంది. నర్సరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Crime News: టీడీపీ కార్యకర్త ఇబ్రహీం హత్యతో పల్నాడు జిల్లా రగిలిపోతోంది. నర్సరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలంలోనే వృద్దుడు షేక్ ఇబ్రహీం మృతిచెందాడు. మరోవ్యక్తి రెహమత్‌ అలీకి తీవ్ర గాయాలయ్యాయి.



ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము. టీడీపీ నేతలు కూడా ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నారు. ఇక హత్య ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి ఘర్షణలు జరగకుండా.. పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ నేతలు బయటకు రాకుండా నిఘా పెట్టారు.


మసీదు విషయంలోనే తమపై దాడి జరిగిందని హత్య నుంచి తృటిలో తప్పించుకున్న మరో బాధితుడు అలీ అరోపిస్తున్నారు. ఇప్పటికే వక్ఫ్‌ భూముల ఆక్రమణలపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోందంటూ అలీ చెబుతున్నారు. తమను పీఎస్‌కు పిలిచి ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితుడు ఆరోపిస్తున్నారు.


టీడీపీ సీనియర్‌ కార్యకర్త ఇబ్రహీంను చంపింది వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే... ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇబ్రహీం ఫిర్యాదు చేశారని నల్లపాటి రాము తెలిపారు.



గతంలోనే రౌడీషీటర్లు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారని అన్నారు. పోలీసులు గంజాయి కేసులు పెడతామంటూ ఇబ్రహీంను బెదిరించారని నల్లపాటి రాము ఆరోపించారు. భూముల విషయంలో హైకోర్టు స్టే ఇవ్వగానే... ఎమ్మెల్యే దగ్గరున్న రౌడీషీటర్లు ఇబ్రహీంను హత్య చేశారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story