Rhea Chakraborty Sushant singh: రియా డ్రగ్స్‌ను కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చేది: ఎన్సీబీ

Rhea Chakraborty Sushant sing : రియా చక్రవర్తపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అభియోగాలు మోపింది. డ్రగ్ డీలర్లైన ఆమె తమ్ముడు శోవిక్ చక్రవర్తి, సామ్యుల్ నుంచి డ్రగ్ పార్సల్స్‌ను కొనుగోలు చేసినట్లు ఎన్సీబీ తాజాగా దాఖలు అభియోగాల్లో పేర్కొంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు రియా బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి అతన్ని మానసికంగా ఆర్థికంగా దెబ్బ తీసినట్లు ఈ కేసులో అనేక ఆరోపణలతో పాటు కొన్ని ఆధారాలు బయటికి వస్తున్నాయి.
ప్రస్తుతం రియాపైన మూడు సెంట్రల్ ఏజెన్సీలైన సీబీఐ, ఈడీ, ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్నాయి. తనపైన వస్తున్న ప్రచారాలు, ఆరోపనలన్నీ అబద్దాలంటోంది రియా. సుశాంత్‌సింగ్ డ్రగ్స్ తీసుకునేవాడు కానీ అందుకు తాను సహకరించలేదని చెప్తుంది.
సుశాంత్ సింగ్ జున్ 14, 2020లో తన రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత రియా చక్రవర్తిపై సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. ఒక నెల జైల్లో ఉండి అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చింది. ఈ కేసులో రియా దోషి అని తేలితే సుమారు 10 సంవత్సరాలు శిక్ష ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com