మేకల విషయంలో గొడవ.. తల్వార్లతో దాడి..!

మేకలు కట్టేసే విషయంలో తలెత్తిన వివాదం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన రాజేంద్రనగర్, సులేమాన్ నగర్‌లో జరిగింది. పక్కనే ఉంటున్న కుటుంబం మేకలు పెంచుతుంది. ఆ మేకలు అక్కడే పార్క్ చేసిన కార్లపై ఎక్కి కారును పాడుచేస్తున్నాయి. ఈ విషయంపై రెండు కుటుంబాలు పలుమార్లు గొడవకు దిగినట్లు తెలుస్తోంది. గురువారం కూడా మేకలు పక్కవారి కారుపై ఎక్కాయి. దీంతో మేకల ఓనర్ కు ఫిర్యాదు చేయడంతో కోపంతో ఊగిపోయిన మేకల యజమానులు పక్కింటి వారిపై తల్వార్లతో, ఇనుప రాడ్లతో దాడి చేశారు.
ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వారి కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. బాధితులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com