ఇంటి సర్వెంట్‌లుగా చేరి నేపాలీ గ్యాంగ్‌ల అరాచకం

ఇంటి సర్వెంట్‌లుగా చేరి నేపాలీ గ్యాంగ్‌ల అరాచకం

రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో నేపాలీ గ్యాంగ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నడుం బిగించారు. రాచకొండ పరిధిలోనే నాలుగు కేసులు నమోదడంతో సవాల్‌గా తీసుకున్నామన్నారు సీపీ మహేష్ భగవత్. తాజాగా ఒక గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. వారి వద్ద నుంచి 90వేల నగదు, 9 తులాల బంగారు, గోల్డ్ లాకెట్, గోల్డ్ హారం, నిద్ర మాత్రలు స్వాధీనం చేసుసుకొని మిగతా వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఇంటి సర్వెంట్‌లుగా చేరి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ నేపాలీ గ్యాంగ్‌లకు కొంతమంది స్థానికులు సహాయం చేస్తున్నట్లు గుర్తించారు. మత్తు మందు ఇచ్చి లూటీ చెయ్యడం వీరి స్టైల్‌ అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story