Viral News: అల్లుడే కదా అని ఇంటికి రానిస్తే.. మేనమామకే

Nephew married his aunty: రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. సొంత మేనల్లుడే కదా అని ఇంటికి రానిస్తే మేనమామ భార్య మీదే కన్నేశాడు ఓ ప్రబద్ధుడు. అతడు ఏకంగా అత్తను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దీంతో మేనమామ షాక్ తిన్నాడు. ఈ ఘటన బీహార్‌లోని జముయి జిల్లాలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో ముంబైలో కాపురం పెట్టాడు. అదే నగరంలో ఆటో నడుపుతున్న అతడి మేనల్లుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. దీంతో అత్తా అల్లుడి మధ్య సన్నిహిత్యం పెరిగింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మేనమామ ఇంట్లో లేని సమయంలో కూడా అతడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు.
ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ అత్త మేనల్లుడితో ఏకాంతంగా గడిపేది. అయితే, ఓ రోజు ఆమె భర్త చూడకూడనిది చూశాడు. వారిద్దరు రొమాన్సులో మునిగితేలడాన్ని చూసి.. చివాట్లు పెట్టాడు. ఈ విషయం వారి కుటుంబం మొత్తానికి తెలిసిపోయింది. ఆ తర్వాత అతడు తన మేనల్లుడిని ఇంట్లో అడుగుపెట్టలేదు. అయితే, అత్తా.. మేనల్లుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఓ రోజు ఆమె భర్త ఇంట్లోలేని సమయంలో మేనల్లుడు ఆమెను ఎత్తుకెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సహజీవనం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. అతడు తన అత్త నుదిటి మీద సింధూరం పెట్టి.. ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొట్టాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com