కొత్త కోడలు.. అత్త మామలకు టీలో నిద్ర మాత్రలు కలిపి..

కొత్త కోడలు.. అత్త మామలకు టీలో నిద్ర మాత్రలు కలిపి..
అందమైన కోడలు వచ్చిందని అత్తమామలు ఎంతో మురిసిపోయారు. మూడు రోజుల్లో ముచ్చట తీరిపోయింది.

అందమైన కోడలు వచ్చిందని అత్తమామలు ఎంతో మురిసిపోయారు. మూడు రోజుల్లో ముచ్చట తీరిపోయింది. మూటా ముల్లె సర్ధుకుని కోడలు చెక్కేసింది. భర్త డ్యూటీకి వెళ్లాడు. అత్తమామలతో అప్యాయంగా మాట్లాడుతూ వారికి వేడి వేడిగా టీ అందించింది. అందులో నిద్ర మాత్రలు కలిపిన విషయం వారికి తెలియదు. శుభ్రంగా తాగేసి మత్తులోకి జారుకున్నారు.

ఈలోపు కోడలు ఇల్లు చక్కబెట్టి వీధి చివర ఉన్న తన గ్యాంగ్‌తో పరారైంది. దొంగలకు అనేక దొడ్డిదారులు ఉన్నట్లే అందంతో పాటు తెలివితేటలు ఉన్న ఈ అమ్మాయి నకిలీ వివాహం చేసుకుని డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంది. రాజస్థాన్ చిత్తూరుగఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ నివాసి అయిన జైరామ్ మాలవ్య‌కు ఓ అమ్మాయి నేహా ఎదురుపడింది. ఇద్దరికీ మాటా మాట కలిసింది. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మంచి అమ్మాయి కోసం చూస్తున్నానని మాటల మధ్యలో ఆ అమ్మాయితో చెప్పాడు. నీకు ఇష్టమైతే నిన్నే చేసుకుంటాను అని చెప్పడంతో ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న ఆమె ఎగిరి గంతేసింది.

జూలై 4 న, నేహా అలియాస్ లాడో కుమావత్ తన ముఠాలోని ఇతర సభ్యులు, సీమా షేక్, సప్నా కట్టింగ్ మరియు షబీర్ చాచా అమ్మాయి బంధువులుగా నటిస్తూ వివాహం గురించి మాట్లాడటానికి వచ్చారు. అతను లాడోను వివాహం చేసుకోవడానికి కుటుంబపెద్దలు అంగీకరించారు.

జూలై 9 న, వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో నిందితురాలికి లక్షా 10 వేలు, న్యాయవాదికి 5 వేల రూపాయలు ఇచ్చామని జైరామ్ చెప్పాడు. ఇప్పుడు పోలీసులు ముగ్గురు మహిళల నేర రికార్డులను పరిశీలిస్తున్నారు.

తప్పించుకోవడానికి, టీలో నిద్రమాత్రలు కలిపారు,

జైరామ్ వృత్తి రీత్యా డ్రైవర్. జూలై 16 న, అతను డ్యూటీలో భాగంగా ఉజ్జయినికి వెళ్లాడు. ఆ రోజు నేహా ఉదయాన్నే రెడీ అయిపోయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు కుటుంబసభ్యుల కోసం టీ తయారు చేసి అందులో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. అది తాగిన కుటుంబ సభ్యులు మూర్ఛపోయారు.

దీనిని సద్వినియోగం చేసుకున్న నేహా పారిపోయింది. ఆ సమయంలో జయరామ్ సోదరి, తల్లి తాత మాత్రమే ఇంట్లో ఉన్నారు. మిగిలిన కుటుంబసభ్యులు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్లారు. ఇంటికి వచ్చి చూసేసరికి అందరూ పడుకుని ఉన్నారు. విషయం తెలుసుకుని వెంటనే జైరామ్‌కి ఫోన్ చేశారు.

జైరామ్.. నేహను వెతికే పనిలో పడ్డాడు. ఉజ్జయిని సమీపంలోని జైసల్ ట్యాంక్ గ్రామానికి సమీపంలో ఉందని తెలుసుకున్నాడు. ఆమెని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఇతర ముఠా సభ్యులు సప్న మరియు సీమలను స్టేషన్‌కు తీసుకువచ్చి ప్రశ్నించారు. వివాహానికి ముందు మరియు తరువాత చేసిన ప్రణాళికకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు అందజేశారు. నేహా తల్లి మున్నీ దేవి వారణాసిలో నివసిస్తుంది. కూతురు ఇలా చేసిందని ఆమెకు చెప్పినా నమ్మలేదు.

Tags

Read MoreRead Less
Next Story