Abdullapurmet : వీడిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసు మిస్టరీ

Abdullapurmet : అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. జ్యోతి భర్త శ్రీనివాసరావే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. విజయవాడలో శ్రీనివాస్‌తో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి యశ్వంత్‌కు మధ్య వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారించారు.
రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం పైవంతెన సమీపంలో చెట్ల పొదల మధ్య మంగళవారం రెండు డెడ్‌బాడీలు గుర్తించారు స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు..డెడ్‌బాడీలకు సమీపంలో ఉన్న హోండా ఆక్టివా ఆధారంగా వివరాలు సేకరించారు. బైక్ ఓనర్ వారాసిగూడకు చెందిన యడ్ల అనిరుధ్‌ను రప్పించారు.
డెడ్‌బాడీలను చూసిన అనిరుధ్ అందులో ఒకటి తన సోదరుడు యడ్ల యశ్వంత్‌దిగా గుర్తించాడు. అక్కడే దొరికిన బ్యాగులో రశీదు ఆధారంగా మృతురాలు వారాసిగూడకు చెందిన జ్యోతిగా తేల్చారు పోలీసులు. క్లూస్ టీం అధికారులు వచ్చి సంఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. హంతకులు ఉపయోగించి స్క్రూడ్రైవర్, రాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యశ్వంత్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అదే ప్రాంతంలో జ్యోతి కుటుంబం నివసించేది. జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త స్టీల్ సామాను బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు అనుమానించిన పోలీసులు..ఆ కోణంలో దర్యాప్తు చేసి కేసును చేధించారు. ఆమె భర్త శ్రీనివాస రావే హత్య చేసినట్లు నిర్ధారించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com