Medak : బ్రెయిన్‌స్ట్రోక్‌తో మృతి.. కాళ్లపారాణి ఆరకముందే నవవధువుకు నూరేళ్లు..!

Medak : రెండేళ్ళు ప్రేమించి.. మనసుకు నచ్చినవాడినే పెళ్లి చేసుకుంది ఆమె ..కానీ ఆ సంతోషం నెలరోజులు కూడా లేదు.. కాళ్లపారాణి ఆరకముందే పాపం ఓ నవవధువుకు నూరేళ్లు నిండిపోయాయి.. మెదక్ జిల్లాలోని ఎన్జీవో కాలనీకి చెందిన రాఘవేంద్రకు పార్వతీపురానికి చెందిన ఉష(23) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ నెల 11న వీరి వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో కొత్తగా అత్తగారింట్లో అడుగుపెట్టింది. అయితే గత శుక్రవారం ఉషకి తలనొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఓ వైద్యుడికి చూపించారు.. అతని సలహా మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కడ మూర్ఛ రావడంతో ఒక్కసారి తీవ్రమైన గుండెపోటు వచ్చి బ్రెయిన్‌స్ట్రోక్‌కు మరణించింది. దీనితో ఇరుకుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికంగా ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com