అయిదు కాసుల బంగారం కోసం అత్తింటి వారి ఆరళ్లు.. గర్భిణి ఆత్మహత్య

అయిదు కాసుల బంగారం కోసం అత్తింటి వారి ఆరళ్లు.. గర్భిణి ఆత్మహత్య
కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కనీస మాత్రమైనా ఆలోచించకుండా

అమ్మ అవుతున్నానన్న ఆనందం ఆవిరైపోయింది.. అత్తింటి వేధింపులకు తాళలేకపోయింది. బంగారంలాంటి వ్యక్తిని భర్తగా చేసుకున్నాననుకుంది.. కానీ బంగారం కోసం పోరుపెడుతున్న అత్తింటి వారి ఆరళ్లు భరించలేక, కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కనీస మాత్రమైనా ఆలోచించకుండా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది కృష్ణ ప్రియ.

ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. జగద్గిరిగుట్ట పీఎస్ పాపిరెడ్డి నగర్ కి చెందిన జిమ్ ట్రైనర్ శ్రవణ్ కుమార్ కి గత జూన్ లో కృష్ణ ప్రియ (24)తో వివాహమైంది. వివాహ సమయంలో ఐదు లక్షలు కట్నంగా ముట్టజెప్పారు. అయినా అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కృష్ణ ప్రియ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉరి వేసుకునా ఆత్మహత్యకు పాల్పడిందని భర్త, అత్తమామలు చెబుతున్నారు. అత్తింటి వారే అదనపు కట్నం కోసం వేధించి హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

పుట్టింటి నుంచి మరో రూ.12 లక్షలు తెమ్మంటూ భార్యను తరచూ వేధించేవాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. గర్భం దాల్చిన కృష్ణ ప్రియను ప్రేమగా చూసుకోవాల్సింది పోయి సీమంతం విషయంలోనూ గొడవ చేశారని ఆరోపించారు. ఐదు కాసుల బంగారం పెడితేనే సీమంతానికి పుట్టింటికి పంపిస్తామని వేధింపులకు గురిచేశారని వాపోయారు. అదపు కట్నం కోసం బిడ్డను అన్యాయంగా బలితీసుకున్నారని కృష్ణ ప్రియ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story