NIA : ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను యాంటీ టెర్రరిస్ట్ ఏజెన్సీ అదుపులోకి తీసుకుంది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని పోలీసులు తెలిపారు. వీరు మధ్యప్రదేశ్ లోని సియోనికి చెందినవారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముగ్గురు వ్యక్తుల ఇళ్లపై దాడి చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. అబ్దుల్ అజీజ్ (40), షోయబ్ ఖాన్ (26).
గత ఏడాది కర్ణాటకలోని శివమొగ్గలో ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బాంబు పేలుడు జరిపి జాతీయ జెండాను దహనం చేశారు. ఈ కేసులోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి ఇళ్లనుంచి నిషేద సాహిత్యం, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎన్ఐఏ బృందం స్వాధీనం చేసుకున్నట్లు సిమోనీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అదుపులోకి తీసుకున్న సాహిత్యంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా ప్రజలు ప్రేరేపించే సాహిత్యం ఉన్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com