NIA : ఎన్‌ఐఏకు చిక్కిన మరో ఐసిస్ ఉగ్రవాది మోహ్సిన్ అహ్మద్..

NIA : ఎన్‌ఐఏకు చిక్కిన మరో ఐసిస్ ఉగ్రవాది మోహ్సిన్ అహ్మద్..
X
NIA : ఐసిస్‌ సానుభూతిపరుల ఆట కట్టిస్తుంది NIA. నిన్న ఢిల్లీలో బిహార్‌కు చెందిన మొహిసీన్‌ అహ్మద్‌ను అరెస్ట్‌ చేశారు.

NIA : ఐసిస్‌ సానుభూతిపరుల ఆట కట్టిస్తుంది NIA. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీలో బిహార్‌కు చెందిన మొహిసీన్‌ అహ్మద్‌ను అరెస్ట్‌ చేశారు. బాట్లా హౌస్‌ వద్ద అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించారు. ఐసిస్‌ సానుభూతిపరులను ఆకర్షించి వారిని సిరియాకు పంపుతున్నట్లు NIA గుర్తించింది.

ఈ నేపథ్యంలో మొహిసీన్‌ను వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లి ఆధారాలు సేకరించాలని NIA.. కోర్టుకు వివరించింది. దీంతో తెలంగాణ పోలీసులు NIAను సంప్రదిస్తున్నారు. గతంలో అనేక మంది ఐసిస్‌ సానుభూతిపరులను తెలంగాణలో అరెస్ట్‌ చేసింది NIA. మొహిసీన్‌తో ఇక్కడి వారికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు తెలంగాణ పోలీసులు.

Tags

Next Story