రంగంలోకి ఎన్ఐఏ.. ఐదు రాష్ట్రాల్లో టెర్రర్ సోదాలు

రంగంలోకి ఎన్ఐఏ.. ఐదు రాష్ట్రాల్లో టెర్రర్ సోదాలు

జైలు ఖైదీలను ఉగ్రవాదులుగా మార్చి జాతిపై ఉసిగొల్పుతుంటాయి టెర్రర్ సంస్థలు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీటికి అడ్డుపడటం లేదు. దీంతో.. ఎన్ఐఏ మళ్లీ రంగంలోకి దిగింది. జాతీయ దర్యాప్తు సంస్థ మార్చి ఐదు, మంగళవారం రోజున ఏడు రాష్ట్రాల్లో సోదాలు చేసింది. ప్రిజన్ రాడికలైజేషన్ కేసులో ఆ తనిఖీలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసుతో లింకున్న ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.

కర్నాటక, తమిళనాడుతో పాటు మరో అయిదు రాష్ట్రాల్లోని 17 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బెంగుళూరు సిటీ పోలీసులు ఈ కోణంలో తొలిసారి కేసు నమోదు చేశారు. గత ఏడాది ఆయుధాలు, మందుగుండ సామాగ్రి స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు కేసు బుక్ చేశారు. ఏడు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రానేడ్లు, 45 లైవ్ రౌండ్లు, నాలుగు వాకీటాకీలు సీజ్ చేశారు. ఆ కేసులో అయిదుగుర్ని తొలుత అరెస్టు చేశారు. వాళ్లను విచారించిన తర్వాత మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టు అయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది.

ఈ కేసులో లష్కరే తోయిబా ఉగ్రవాది టీ నజీర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉన్న అయిదుగుర్ని అతను రాడికలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో జునైద్ అహ్మద్ అనే వ్యక్తి కూడా నిందితుడే. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బెంగుళూరు సెంట్రల్ జైలులో 2013 నుంచి నజీర్ ఖైదీగా ఉన్నాడు. 2017లో కొంత మంది ఖైదీలు చేరడంతో వాళ్లను రాడికలైజ్ చేసి పనిలో పడ్డాడు అతను. గత అక్టోబర్లో ఈ కేసును ఎన్ఐఏ తీసుకున్నది. ఆ తర్వాత రెయిడ్స్ నిర్వహించింది.

Tags

Read MoreRead Less
Next Story