Nizamabad Gang Rape: నిజామాబాద్ గ్యాంగ్‌రేప్‌ నిందితుల అరెస్ట్..

Nizamabad Gang Rape: నిజామాబాద్ గ్యాంగ్‌రేప్‌ నిందితుల అరెస్ట్..
X
Nizamabad Gang Rape: నిజామాబాద్ జిల్లాలో యువతి గ్యాంగ్‌రేప్‌ నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

Nizamabad Gang Rape: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన యువతి గ్యాంగ్‌రేప్‌ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. గ్యాంగ్‌రేప్ వివరాలను సీపీ కార్తికేయ మీడియాకు వెల్లడించారు. రాత్రి వేళ బస్టాండ్, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి మద్యం తాగించి నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. బస్టాండ్‌ సమీపంలోని ఓ ఆసుపత్రి గదిలో ఈ ఘటన జరిగింది. అపస్మారక స్థితిలో యువతిని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని సఖి సెంటర్‌ కు తరలించారు.

Tags

Next Story