Nizamabad: మంత్రి ప్రశాంత్ రెడ్డి వద్ద పనిచేసే ఆఫీస్‌బాయ్ ఆత్మహత్య..

X
Nizamabad: నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాశంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య కలకలం రేపింది. దేవేందర్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా మంత్రి ఇంట్లో పనిచేస్తున్న దేవేందర్‌కు ఓ యువతిని ప్రేమిస్తునట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు ఆమెతో ఫోన్‌లో చాటింగ్ చేసి తరువాత ఉరివేసుకునట్లు పోలీసులు చెపుతున్నారు. అయితే మంత్రి ఇంటి వద్దకు మీడియాను పోలీసులు అనుమతించట్లేదు. ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్దకు ఎవరూ వెళ్లకుండా.. బారికేడ్లు ఏర్పాటు చేసి.. డెడ్ బాడీని పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఏసీపీ ప్రభాకర్ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
