Nizamabad: శ్రీకాంత్‌ను హత్య చేశారు.. కుటుంబసభ్యుల ఆరోపణ

Nizamabad: శ్రీకాంత్‌ను హత్య చేశారు.. కుటుంబసభ్యుల ఆరోపణ
Nizamabad: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో అనుమానస్పద స్థితిలో చనిపోయిన శ్రీకాంత్‌ పటేల్‌ డెడ్‌బాడీకి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో అనుమానస్పద స్థితిలో చనిపోయిన శ్రీకాంత్‌ పటేల్‌ డెడ్‌బాడీకి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మరోవైపు శ్రీకాంత్‌ను హత్య చేశారని..అందుకు కారణమైన వారిని అరెస్టు చేయాలంటూ కుటుంబసభ్యులు బోధన్‌-రుద్రూర్‌ రహదారిపై ధర్నాకు దిగారు.



దాదాపు 20 గంటల పాటు ధర్నా కొనసాగింది. తెల్లవారుజామున ఐదు గంటలకు పోలీసులు ధర్నాను భగ్నం చేశారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజామున 5 గంటల వరకు శ్రీకాంత్ పటేల్ బంధువుల ఆందోళన కొనసాగింది.



బోధన్ మండలం ఖండ్‌గావ్‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ బోధన్‌లోని ప్రైవేట్ కాలేజ్‌లో డిగ్రీ చదివేవాడు. అదే కాలేజీలో చదువుతున్న అమ్మాయితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. సెప్టెంబర్‌ 17న ఇద్దరు కలిసి వెళ్తుండగా.. యువతి తరపు వారు శ్రీకాంత్‌ను బెదిరించారని అతని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.




అదే నెల 23న కాలేజీకి వచ్చిన శ్రీకాంత్‌ తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఐతే సెప్టెంబర్‌ 24న అతని తండ్రి లక్ష్మణ్‌ పటేల్ శ్రీకాంత్ అదృశ్యమయ్యాడంటూ బోధన్ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తరపు బంధువులను విచారిస్తే తమ కొడుకు ఆచూకీ లభిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీకాంత్‌ రైలులో మరో చోటుకు వెళ్లినట్లు బాధిత కుటుంబానికి చెబుతూ వచ్చారు. ఐతే తల్లిదండ్రులు మాత్రం ఐదుగురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు.



ఐతే సోమవారం బోధన్ సమీపంలోని పసుపు వాగు దగ్గర కుళ్లిపోయిన స్థితిలో యువకుడి డెడ్‌బాడీ దొరికింది. అది శ్రీకాంత్‌ డెడ్‌బాడీగా పోలీసులు నిర్ధారించారు. యువకుడి తల, మొండెం వేరుచేసి ఉండడంతో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమ్మాయిది అగ్రకులం కావడంతో ఆమె తరపు బంధువులే హత్య చేశారని శ్రీకాంత్‌ పేరెంట్స్‌ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story