క్రైమ్

పక్కింటి వ్యక్తితో వివాహేతర బంధం.. 20ఏళ్ల తర్వాత బట్టబయలు..!

Odisha: పక్కింటి వ్యక్తితో శరీరక సంబంధం భర్తకు తెలియకుండా 20 ఏళ్లు దాచింది ఆ ఇల్లాలు.

పక్కింటి వ్యక్తితో వివాహేతర బంధం.. 20ఏళ్ల తర్వాత బట్టబయలు..!
X

Odisha: పక్కింటి వ్యక్తితో శరీరక సంబంధం భర్తకు తెలియకుండా 20 ఏళ్లు దాచింది ఆ ఇల్లాలు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని కుమారుడి అనారోగ్యం బయటపెడుతుందని ఆమె గ్రహించలేదు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కుమారుడు(18) తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడుతుండేవాడు. దగ్గరలోని అన్ని ఆస్పత్రుల్లో చూపించినప్పటికి పెద్దగా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి తన కుమారుడిని ఢిల్లీ, గురుగావ్‌ ఫోర్టీస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

ఫోర్టీస్‌ ఆస్పత్రి వైద్యులు అతడికి టెస్టులు నిర్వాహించారు. దాంతో అతనికి 'సికిల్ సెల్ అనీమియా' అనే వ్యాధి ఉందని తెలిసింది. అయితే ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బని వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రులిద్దరి నుంచి పిల్లలకు ఈ జబ్బు వస్తుందని వైద్యలు తెలిపారు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ చేయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకసారి సదరు వ్యక్తితోపాటు అతని భార్యకు టెస్టులు చేయాలని వైద్యులు చెప్పారు. దానికి ఆ వ్యక్తి, అతడి భార్యకు టెస్ట్‌లు చేయుంచుకున్నారు. దాంతో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ టెస్టుల్లో ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడిగా తేలింది. ఇక అతడి భార్యలో సికెల్‌ సెల్‌ అనీమియా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. అయితే తల్లిదండ్రులిద్దరిలో సికెల్‌ సెల్‌ అనీమియా మధ్యస్థ లక్షణాలు ఉంటేనే.. వారి ద్వారా వంశపారంపర్యంగా అది పిల్లలకు వస్తుంది. కానీ ఇక్కడ ఆ వ్యక్తికి అలాంటి లక్షణాలు లేవని గుర్తించారు వైద్యులు. ఎందుకైనా మంచిదని మరోసారి టెస్ట్‌ చేశారు. అప్పుడు కూడా అదే ఫలితం రావడంతో ఈ విషయాన్ని కుర్రాడికి తెలిపారు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడా యువకుడు.

ఈ క్రమంలో భార్యను అనుమానించిన అతన ఇంటికి వెళ్లిన తర్వాత నిలదీశాడు. దాంతో సదరు వ్యక్తి భార్య తన తప్పు అంగీకరించింది. దాదాపు 20 ఏళ్ల క్రితం పక్కింటి వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేదని తెలిపింది. పక్కింటి వ్యక్తితోనే గర్భం వచ్చినట్లు చెప్పింది. దీంతో ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. ఆ కుర్రాడికి అదే 'సికిల్ సెల్ అనీమియా' జబ్బు వచ్చినట్లు వైద్యులు భావిస్తున్నారు.

Next Story

RELATED STORIES