Ramagundam : అవినీతికి అడ్డాగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్..

Ramagundam : అవినీతికి అడ్డాగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్..
Ramagundam : తెలంగాణ రాష్ట్రంలోనే అవినీతికి నిలయంగా మారింది పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్‌

Ramagundam : తెలంగాణ రాష్ట్రంలోనే అవినీతికి నిలయంగా మారింది పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్‌. గతంలో మాయమైన పనులకు సంబంధించిన 240 ఫైళ్లు పాలకవర్గం ఆమోద ముద్ర కోసం మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే ఇదంతా ప్రజలకు మౌలిక సదుపాయాలకు కాదు. పాలకవర్గ సభ్యుల జేబులు నింపుకోవడానికే అన్న విమర్శలు ఉన్నాయి.కాగితాల మీద జరిగే పనులకు అయితే 30 శాతం...నిజంగా చేసిన పనులకైతే పది శాతం కమీషన్‌ ఇస్తేనే పాలకవర్గం ఆమోదం తెలుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నారు.

ఇక గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి శంకర్‌ కుమార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అప్పుడు మాయమైన దాదాపు 240 ఫైళ్లు మళ్లీ దొడ్డి దారిన అజెండాకు వచ్చాయి.ఈ అంశంపై ప్రతిపక్షాలు కూడ నిలదీయడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఎన్నో అవినీతి,అక్రమాలకు రామగుండం కార్పోరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని, విజిలెన్స్‌ విచారణ జరుగుతుండగా 240 ఫైళ్లు అజెండాకు ఎలా వస్తాయని, దీనిపై విచారన జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశారు.

మరోవైపు కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక గౌతమీనగర్‌లో తడి,పొడి చెత్తలను వేరు చేసేందుకు ఏర్పాటు చేసిన కాంపాక్టర్‌ యంత్రాలు వృధాగా ఉన్నాయి.వీటి విలువ దాదాపు 70 లక్షలు ఉంటుంది. వీటి కోసం నిర్మించిన షెడ్డు 20 లక్షలు అయితే ఇవి వృధా పడి ఉన్నాయి.మరోవైపు డ్రై రిస్సోర్స్‌ కలెక్షన్‌ సెంటర్‌ లో పనులు నిర్వహించకుండనే ఓ కాంట్రాక్టర్‌ 16 లక్షల రూపాయలు బిల్లులు సృష్టించాడు.గది నిర్మాణం పేరట ఎనిమిది లక్షల రూపాయలు, షెట్టర్‌ మర్మమత్తుకు నాలుగు లక్షలా 80 వేలు,టాయిలెట్‌ నిర్మణానికి మూడు లక్షల 50 వేలు బిల్లులు పెట్టి కార్పోరేషన్‌ నిధులు స్వాహా చేశాడు.

ఇక అసలు విషయం ఏమిటంటే అసలు అక్కడ షెట్టర్‌ ఉన్న గదిలేదు. అయినా ఉన్నట్లు చూపి బిల్లు పెట్టి నిధులు మింగేశారన్న విమర్శలు ఉన్నాయి.సమ్మక్క జాతర,అద్దె వాహనాల పేరట,ఇలా నోటికి ఏది వస్తే అదే బిల్లులు రాసుకుంటున్నారు. చివరికి కార్పొరేషన్‌ కొంత స్థలాన్ని పెట్రోల్‌ బంక్‌ కు విక్రయానికి సిద్ధం అవుతున్నారు.తెలంగాణలో కార్పోరేషన్‌కు కేటాయించిన స్థలాన్ని ఎక్కడా అమ్మిన దాఖలాలు లేవు. అయితే రామగుండం కార్పోరేషన్‌లో అధికార టీఆర్‌ఎస్‌ మేయర్‌, కార్పోరేటర్లు ఇష్టమోచ్చిన రీతి వ్యవహరిస్తున్నారని దీనిపై మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు విపక్ష సభ్యులు.

Tags

Next Story