బ్యూటీషియన్ నిర్వాకం... మహిళకు ఊడిన జుట్టు

బ్యూటీషియన్ నిర్వాకం...  మహిళకు ఊడిన జుట్టు

హైదరాబాద్‌లో ఓ బ్యూటీపార్లర్ నిర్వాకం బట్టబయలైంది. బ్యూటీషియన్ నిర్వాకంతో ఓ మహిళకు జుట్టు ఊడిపోయింది. ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళ అబిడ్స్‌లోని ఓ ఫేమస్ బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. పొడుగ్గా ఉన్న తన జుట్టును కట్ చేసి అయిల్ పెట్టి కాస్త ట్రెండీగా మార్చమని బ్యూటీషియన్‌కు తెలిపింది. జుట్టు అందంగా తయారవ్వడం పక్కన పెడితే జుట్టు మొత్తం ఊడిపోయింది. ఊడిపోతున్న జుట్టును చూసి ఆ మహిళ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇంటికి పరుగులు తీశారు.

ఒత్తైన పొడవైన జుట్టుతో బ్యూటీపార్లర్‌కు వెళ్లిన భార్య ఇలా ఊడిపోతున్న జుట్టుతో వచ్చే సరికి భర్త కూడా షాక్ తిన్నాడు. ఏం జరిగిందో అని ఆరా తీశాడు. అసలు విషయం తెలుసుకొని బ్యూటీపార్లర్‌ వద్దకు వెళ్లి వారిని నిలదీశారు. భార్యభర్తల మధ్య గొడవ కూడా జరిగింది.

భర్త తిట్టడంతో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఏం చేయాలో తెలియక ఊడిపోతున్న జుట్టును పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బ్యూటీపార్లర్‌ నిర్లక్ష్యం వల్లే తన జుట్టు ఊడిపోతుందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

Tags

Read MoreRead Less
Next Story