క్రైమ్

Srikakulam : వృద్ధ దంపతులపై పాశవికంగా దాడి చేసిన యువకులు..

Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో వృద్ధ దంపతులపై అత్యంత పాశవికంగా దాడి చేశారు

Srikakulam : వృద్ధ దంపతులపై పాశవికంగా దాడి చేసిన యువకులు..
X

Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో వృద్ధ దంపతులపై అత్యంత పాశవికంగా దాడి చేశారు ఇద్దరు యువకులు. మందస మండలం పొత్తంగిలోని మొగిలిపేటలో వృద్ధ దంపతులకు, యువకులకు మధ్య కొంతకాలంగా ఇంటి స్థలంపై వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. సీతాపతి, జానకి రాం అనే వ్యక్తులు తమ స్థలంలో ఇల్లు కట్టుతున్నారని ఆరోపిస్తున్న బూనయ్య దంపతులు.. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఓవైపు యువకులు కొట్టి తోసేస్తున్నా సరే.. వృద్ధ దంపతులు మాత్రం ఇంటి గోడను గునపంతో తొలిగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ఇద్దరు యువకులు దారుణంగా వృద్ధ దంపతులపై దాడి చేశారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES