దారుణం.. వృద్ధురాలి గొంతు కోసి, నగలు దోచుకెళ్లిన దుండగులు

దారుణం.. వృద్ధురాలి గొంతు కోసి, నగలు దోచుకెళ్లిన దుండగులు
X
ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిని గొంతు కోసి.. 3 తులాల బంగారం, 20 తులాల వెండి నగలను దోచుకెళ్లారు.

సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీ సెకండ్‌ ఫేజ్‌లో దారుణం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి గొంతు కోసి, బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు దుండగులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిని గొంతు కోసి చంపారు. 3 తులాల బంగారం, 20 తులాల వెండి నగలను దోచుకెళ్లారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. పాత నేరస్తులా..? లేక కొత్త నేరస్తుల పనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Next Story