KARNATAKA: బళ్లారిలో క్షణ క్షణం.. భయం..భయం

కర్ణాటకలోని బళ్లారిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు కోసం ఫ్లెక్సీలు కడుతుండగా వివాదం చెలరేగింది. దీంతో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్‌రెడ్డి తుపాకితో కాల్పులకు తెగబడగా మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, సతీష్‌కు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించి 144సెక్షన్ విధించారు.రెండు వర్గాల మధ్య ఘర్షణ చేయి దాటి పోవడంతో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడం, రాజశేఖర్ అనే యువకుడి మృతితో ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి, కాల్పులు, చివరికి ఒకరు మృతి చెందే వరకు దారితీయడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి రాత్రి 9.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోసారి రెండు వర్గాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరుకుంది. రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. పోలీసులు సైతం రాళ్ల దాడిని తప్పించుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి ఎస్పీ ఆదేశాలతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

