Hyderabad: లోన్‌ యాప్స్‌ వేధింపులు.. హైదరాబాద్‌లో మరో యువకుడు బలవన్మరణం..

Hyderabad: లోన్‌ యాప్స్‌ వేధింపులు.. హైదరాబాద్‌లో మరో యువకుడు బలవన్మరణం..
X
Hyderabad: హైదరాబాద్‌లో లోన్‌ యాప్స్‌ వేధింపులు ఆగడం లేదు. దీంతో మరో యువకుడు బలయ్యాడు.

Hyderabad: హైదరాబాద్‌లో లోన్‌ యాప్స్‌ వేధింపులు ఆగడం లేదు. దీంతో మరో యువకుడు బలయ్యాడు. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చెన్నపురం సాయిగణేష్‌ కాలనీలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహమ్మద్‌ ఖాజా అనే యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఖాజా బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఫోన్‌లో వేధింపులు ఎక్కువయ్యాయని అంటున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు జవహర్‌నగర్‌ పోలీసులు.

Tags

Next Story