Siddipet : అదుపు తప్పి బావిలో పడ్డ కారు..

Siddipet : అదుపు తప్పి బావిలో పడ్డ కారు..
X
Siddipet : సిద్దిపేట జిల్లా జప్తి నాచారం గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది

Siddipet : సిద్దిపేట జిల్లా జప్తి నాచారం గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వస్తున్న కారు... అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో చిక్కుకున్న వ్యక్తి మృతి చెందగా... స్థానికుల సహాయంలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు... తాడు సాయంతో బావిలో నుంచి కారును బయటకు తీశారు. మృతుడు సూరంపల్లికి చెందిన యాదగిరిగా గుర్తించారు. గాయపడ్డ ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో కారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. కారు స్పీడుగా బావిలోకి దూసుకెళ్లడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన కాపాడే ప్రయత్నం చేశారు. అతికష్టం మీద ఇద్దరిని ఒడ్డకు చేర్చారు. అయితే మరో వ్యక్తి కారులో ఇరుక్కుపోవడంతో మృతి చెందాడు.

Tags

Next Story