AP: బెట్టింగ్.. కుటుంబమంతా ఆత్మహత్యయత్నం

AP: బెట్టింగ్.. కుటుంబమంతా ఆత్మహత్యయత్నం

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో రూ.30 లక్షలు కోల్పోడంతో చిత్తూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాకు యత్నించారు. గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం పురుగుల తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుమారుడు దినేష్, నాగరాజా రెడ్డి ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్‌లో రూ. 30 లక్షలు కోల్పోడంతో నాగరాజా రెడ్డి, తల్లి జయంతి, సోదరి సునీత, దినేష్ ఆత్మహత్యకు యత్నించారు.

ఏమైందంటే..

ఆన్‌లైన్ బెట్టింగ్‌ రూ. 30 లక్షల వరకూ పందేలు కాచారు. చివరకు ఒక్క రూపాయి కూడా తిరిగిరాలేదు. దీంతో మనస్థాపం చెందారు. అప్పుల భయంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజారెడ్డి ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డారు. సొంత డబ్బులే కాకుండా అప్పులు చేసి మరి బెట్టింగుల్లో పెట్టారు. అలా రూ. 30 లక్షలు పోగొట్టుకున్నారు. అప్పులపాలు కావడంతో నాగరాజారెడ్డి కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. నాగరాజారెడ్డితో పాటు కుమారుడు దినేశ్, భార్య జయంతి, కుమార్తె సునీత ఇంట్లోనే పురుగుల మందు తాగారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story