Crime News: భార్య మీద కానిస్టేబుల్ కళ్లు .. ముక్కు, చెవులు కోసిన భర్త

Crime News: పాక్ వ్యక్తి తన భార్యతో ఎఫైర్ కలిగి ఉన్నందుకు పోలీసు చెవులు, ముక్కు, పెదవులు కోసేశాడు. కానిస్టేబుల్ ఖాసిం హయత్‌ను తీవ్ర చిత్రహింసలకు గురిచేసిన మహమ్మద్ ఇఫ్తికార్ అనే ప్రధాన నిందితుడు అతని సహచరులతో కలిసి ఆదివారం ఝాంగ్ జిల్లాలో అతని ముక్కు, చెవులు మరియు పెదాలను కట్ చేశాడు.
తన భార్యను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన ఓ వ్యక్తి పోలీసు కానిస్టేబుల్ ముక్కు, చెవులు, పెదవులను కోసేసినట్లు పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని పోలీసులు సోమవారం తెలిపారు.
లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని ఝాంగ్ జిల్లాలో ఆదివారం నాడు ముహమ్మద్ ఇఫ్తికార్ అనే ప్రధాన నిందితుడు అతని సహచరులతో కలిసి పోలీస్ కానిస్టేబుల్ ముక్కు, చెవులు, పెదవులను కోసేశాడు. కానిస్టేబుల్ ఖాసిం హయత్‌ను తీవ్ర చిత్రహింసలకు గురి చేయడంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.. ప్రస్తుతం అతడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
'హయత్‌కు భార్యతో సంబంధాలున్నాయనే అనుమానంతో 12 మంది అనుచరులతో కలిసి అతడిపై దాడి చేశాడు. కానిస్టేబుల్ ఇంటికి వెళుతున్న సమయం చూసి కాపు కాశాడు.. అతడిని అపహరించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తీవ్ర చిత్రహింసలకు గురిచేసిన ఇఫ్తీకర్.. పదునైన కత్తితో అతడిపై దాడి చేశాడు అని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు ఇఫ్తీకర్‌ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com