పాక్ అండర్ వరల్డ్ డాన్ హత్య .. వివాహ వేడుకలో గుర్తు తెలియని వ్యక్తులు..

పాక్ అండర్ వరల్డ్ డాన్ హత్య .. వివాహ వేడుకలో గుర్తు తెలియని వ్యక్తులు..
లాహోర్ వివాహ వేడుకలో పాక్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు కాల్చి చంపబడ్డాడు.

అమీర్ బాలాజ్ టిప్పు లాహోర్ అండర్ వరల్డ్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అమీర్ కుటుంబం నేర చరిత్రను కలిగి ఉంది. లాహోర్ అండర్ వరల్డ్‌లో ప్రముఖ వ్యక్తి, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ యజమాని అయిన అమీర్ బాలాజ్ టిప్పు ఫిబ్రవరి 18న చుంగ్ ప్రాంతంలో జరిగిన వివాహ వేడుకలో గుర్తుతెలియని దుండగుడు కాల్చి చంపాడు. పాకిస్తాన్ కు చెందిన ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ ఈ విషయాన్ని ధృవీకరించింది.

2010లో అల్లామా ఇక్బాల్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన దాడికి బలి అయిన ఆరిఫ్ అమీర్, అలియాస్ టిప్పు ట్రక్కన్‌వాలా కుమారుడు అమీర్ బాలాజ్ టిప్పు, తుపాకీ కాల్పుల్లో తగిలిన గాయాలతో మరణించాడు.

పోలీసు నివేదికల ప్రకారం, దుండగుడు అమీర్ మరియు మరో ఇద్దరు అతిథులపై కాల్పులు జరిపాడు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన అమీర్ సాయుధ సహచరులు ప్రతీకారం తీర్చుకున్నారు, వెంటనే దాడి చేసిన వ్యక్తిపై కాల్పులు జరిపారు. దాంతో అమీర్ పై కాల్పులు జరిపిన దుండగుడు మరణించాడు.

అమీర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ జిన్నా ఆసుపత్రిలో మరణించాడు. అమీర్ మరణ వార్త అతని మద్దతుదారులలో దుఃఖం మరియు ఆగ్రహాన్ని రేకెత్తించింది. వారు అతన్ని పోగొట్టుకున్న దు:ఖంలో ఆసుపత్రి వద్ద సమావేశమయ్యారు. కొంతమంది మహిళలు తమ ఛాతీని బాదుకుంటూ నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరికొందరు అమీర్ పట్ల తమకున్న విధేయతను ప్రకటిస్తూ బిగ్గరగా విలపిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణ అంతా హృదయ విదారకంగా మారిపోయింది.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని మూసివేశారు. సంఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. దాడి వెనుక ఉద్దేశాన్ని వెలికితీయడం, దుండగుడి అనుచరులను గుర్తించడంపై వారి ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోంది. నివేదికల ప్రకారం ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

Tags

Next Story