Kerala: ఏంటీ ఘోరాలు.. వెయ్యి జంటలు భార్యలను మార్చుకుంటూ..

Kerala: భరించేవాడిని భర్త అంటారు. కానీ.. భార్యను నలుగురికీ పంచేవాడిని ఏమనాలి. వేరొకరి భార్యను తన బెడ్‌రూమ్‌కి తీసుకొచ్చేవాడిని ఏం చేయాలి..! ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్‌లోనో, అప్పుడప్పుడూ సినిమాల్లోనో చూసిన సీన్లు.. ఇప్పుడు మన దేశంలో కూడా నిజమైపోతున్నాయి. కామంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్న కొందరు మద మహారాజులు.. రెచ్చిపోయి ఈ వికృత క్రీడకు తెరతీస్తున్నారు. కేరళలో తాజాగా వెలుగు చూసిన 'వైఫ్ స్వాపింగ్' వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి జంటలు.. ఔను మీరు విన్నది నిజమే.. వెయ్యి జంటలు.. తమ జీవిత భాగస్వాములను మార్చుకుంటూ ఇలా లైంగిక కోరికలు తీర్చుకుంటున్నాయ్. ఒకరి పార్ట్‌నర్‌ను మరొకరు మార్చుకుంటూ విచ్చలవిడిగా సుఖాన్ని వెతుక్కుంటున్నారు. ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. భర్తలే తమ భార్యల్ని బలవంతంగా ఈ 'వైఫ్ స్వాపింగ్' వ్యవహారంలోకి దించడం. పరాయి వ్యక్తితో బలవంతపు శృంగారంపై ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
'పార్ట్‌నర్ స్వాప్'పై విచారణ మొదలుపెట్టాక వెలుగులోకి వచ్చిన విషయాలు చూసి పోలీసులకే దిమ్మతిరిగిపోయింది. విచారణ సందర్భంగా ఆమె అనేక షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. తన భర్త మరో వ్యక్తితో శృంగారం చేయాలని తనను అనేకసార్లు బలవంతపెట్టినట్లు ఆమె కన్నీటిపర్యంతమైంది. 9 సార్లు తాను నరకం చూశానంది. చెప్పినట్టు చెయ్యకపోయినా, విషయం ఎవరికైనా చెప్పినా తాను సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడంది. దీంతో.. వెంటనే ఆమె భర్తను అరెస్టు చేసిన పోలీసులు..
అసలు వేరే వాళ్లతో భార్య ఎక్స్‌ఛేంజ్‌కి సంబంధించిన యవ్వారం ఎలా సాగుతోందా అని ఆరా తీస్తే ఆన్‌లైన్ నెట్‌వర్క్ గుట్టు మొత్తం దొరికింది. ఈ కేసులో సోమవారం ఏడుగురిని అరెస్టు చేశారు. ఇవాళ మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అందర్నీ జైలుకు పంపారు. నిందితులంతా కేరళలోని కొట్టాయం, అలప్పుజ, ఎర్నాకుళం జిల్లాలకు చెందిన వారు. త్వరలో మరికొందరికి కూడా బ్యాండ్ పడబోతోంది.
'వైఫ్ స్వాపింగ్' కోసం ఈ బ్యాచ్ అంతా టెలిగ్రామ్, మెసెంజర్ లాంటి యాప్స్ వాడుతున్నారు. మొత్తం 14 ఆన్‌లైన్ గ్రూప్‌లు ఇప్పటి వరకూ లెక్క తేలాయి. ఈ తరహా శృంగారానికి సంబంధించిన కొన్ని గ్రూపుల్లో 5 వేల మంది వరకు ఉన్నట్లు కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో కొందరు స్వచ్ఛందంగా పాల్గొంటుండగా.. మరికొందరిని వారి జీవిత భాగస్వాములు బలవంతంగా ఇందులోకి లాగుతున్నారు.
అలాగని.. ఈ రాకెట్‌లో ఉన్నది మామూలు వాళ్లేమీ కాదు. సమాజంలో పేరున్న వాళ్లు, డాక్టర్లు, లాయర్లు, ఇలా ఎందరో హైప్రొఫైల్ వ్యక్తులు.. ఫేక్ ఐడీలతో ఈ గ్రూపుల్లో జాయిన్ అవుతున్నారు. అక్కడ నచ్చిన వారిని ఎంచుకుని భార్యల్ని ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ విచారణలో తేలిన దాన్ని బట్టి చూస్తే.. ఈ గ్రూపుల్లోని 90 శాతం మహిళలు భర్తల ఒత్తిడితో, అయిష్టంగానే గ్రూపుల్లో చేరారు.
ఆన్‌లైన్ గ్రూప్‌లో పరిచయం ద్వారా 'పార్ట్‌నర్ స్వాపింగ్'కి సిద్ధమైన వాళ్లలో డ్రగ్ రాకెట్‌తో లింక్‌లు ఉన్నవాళ్లు కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ మత్తులోనే ఇలాంటి అసాంఘిక ఘటనలకు బీజం పడుతోందనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. అటు, కపుల్‌తో కాకుండా విడిగా వచ్చే వాళ్లకు 10 నుంచి 15 వేల వరకూ ఛార్జ్ చేసి వ్యభిచార ముఠా తరహాలో ఇదంతా నడుస్తున్నట్టు విచారణలో తేలింది.
ప్రస్తుతం కేసు పెట్టిన బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. వైఫ్ స్వాపింగ్ కోసం ఐదుగురు వ్యక్తులు తమ భార్యలతో కలిసి వచ్చారు. ఈ కేసులో ఆమె ధైర్యంతో ఫిర్యాదు చేసేందుకు బయటకు వచ్చింది. చాలా మంది పరువు పోతుందనే కారణంగా ఈ నరకాన్ని మౌనంగా భరిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com