PAUL: కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు

PAUL: కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు
X

ప్ర­జా­శాం­తి పా­ర్టీ అధ్య­క్షు­డు కేఏ పా­ల్‌­పై హై­ద­రా­బా­ద్‌ పో­లీ­సు­లు కేసు నమో­దు చే­శా­రు. కేఏ పాల్ లైం­గిక వే­ధిం­పుల పా­ల్ప­డ్డా­ర­ని ఆరో­పి­స్తూ ఓ మహి­ళా ఫి­ర్యా­దు చే­య­డం­తో పం­జా­గు­ట్ట పో­లీ­సు స్టే­ష­న్‌­లో కేసు నమో­దైం­ది. కేఏ పాల్ ఆఫీ­సు­లో పని­చే­సే ఓ మహిళ షీ టీ­మ్స్‌­ను ఆశ్ర­యిం­చా­రు. తనపై కేఏ పాల్ లైం­గిక వే­ధిం­పు­ల­కు పా­ల్ప­డ్డా­ర­ని ఆరో­పిం­చా­రు. వా­ట్సా­ప్‌­లో అను­చిత సం­దే­శా­లు పం­పు­తు­న్నా­డ­ని చె­ప్పా­రు. అలా­గే ఆఫీ­సు­లో అను­చి­తం­గా తా­క­డం వం­టి­వి చే­స్తు­న్నా­డ­ని కూడా ఆరో­పిం­చా­రు. అయి­తే మహిళ ఫి­ర్యా­దు­పై స్పం­దిం­చిన షీ టీ­మ్స్... ఫి­ర్యా­దు­ను పం­జా­గు­ట్ట పో­లీ­సు­ల­కు పం­పా­యి. పం­జా­గు­ట్ట పో­లీ­సు­లు కేఏ పా­ల్‌­పై కేసు నమో­దు చే­శా­రు. విధి ని­ర్వ­హ­ణ­లో ఉన్న తనను పాల్ లైం­గి­కం­గా వే­ధిం­పు­ల­కు గు­రి­చే­శా­డ­ని బా­ధి­తు­రా­లు పే­ర్కొం­ది. దీ­ని­కి సం­బం­ధిం­చిన వా­ట్సా­ప్ మె­సే­జ్ లను పో­లీ­సు­ల­కు అం­ద­జే­సిం­ది.

త్వ­ర­లో జర­గ­ను­న్న జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ల్లో కేఏ పాల్ బరి­లో­కి ది­గు­తా­ర­ని ప్ర­చా­రం జర­గ­డం­తో కొం­ద­రు ఆయ­న­పై బురద జల్లే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­ర­ని టీం చె­బు­తోం­ది. అం­దు­లో భా­గం­గా­నే కేఏ పాల్ ప్ర­తి­ష్ట ది­గ­జా­ర్చేం­దు­కు ఇలాం­టి చీప్ ట్రి­క్స్ ప్లే చే­స్తు­న్నా­ర­ని ఆయన టీం పే­ర్కొం­ది. ఆయ­న­పై వచ్చిన లైం­గిక వే­ధిం­పుల ఆరో­ప­ణ­ల­ను తీ­వ్రం­గా ఖం­డిం­చిం­ది. పాల్ పరు­వు, ప్ర­తి­ష్ట­ల­కు భంగం కలి­చేం­దు­కు ఎవ­రై­నా ప్ర­య­త్ని­స్తే వా­రి­పై చట్ట ప్ర­కా­రం పరు­వు­న­ష్టం దావా వే­స్తా­మ­ని హె­చ్చ­రిం­చిం­ది.

Tags

Next Story