Hyderabad: ట్రక్కుకు సీక్రెట్ క్యాబిన్.. 265 కేజీల గంజాయి తరలించే ప్లాన్..

Hyderabad: డ్రగ్ స్మగ్లర్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సినిమాను తలపించేలా కొత్త పందాతో.. మత్తు పదార్థాలను బోర్డర్లు దాటించేస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా డ్రగ్ స్మగ్లర్ల ముఠా గుట్టు రట్టయ్యింది. ఓ ట్రక్కుకు సీక్రెట్ క్యాబిన్ ఏర్పాటు చేసుకుని మరీ.. గంజాయి తరలిస్తుండగా మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి, వారి నుంచి 265 కేజీ గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా రాష్ట్రం కోరాపూట్ నుంచి హైదరాబాద్ మీదుగా యూపీలోని మీరట్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్‌పై చెక్కింగ్ ఉండటంతో.. సిటీలోకి చొరబడ్డారని మాదాపూర్ డీసీపీ శిల్పా తెలిపారు. ట్రక్కుకు ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసుకుని.. గంజాయి తరలించే ప్రయత్నం చేశారని.. దీని విలువ దాదాపు 55 లక్షలు ఉంటుందన్నారు. నిందితులంతా మీరట్‌కు చెందిన మహమ్మద్ ఇక్బాల్, షారుఖ్, సలీంగా గుర్తించారు. మరో వ్యక్తి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com