Anantapur: అనంతపురం జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపై మహిళను స్తంభానికి కట్టి, దుస్తులు చించి..

Anantapur: అనంతపురం జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపై మహిళను స్తంభానికి కట్టి, దుస్తులు చించి..
X
Anantapur: మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి, దుస్తులు చించి, విచక్షణారహితంగా కొట్టిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

Anantapur: మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి, దుస్తులు చించి, విచక్షణారహితంగా కొట్టిన అమానవీయ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. గుంతకల్లులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ మహిళ.. మోహన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో మోహన్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు మహిళపై దాడి చేశారు. మహిళను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి, రోడ్డుపై స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు.

దుకాణంలోని పండ్లను రోడ్డుపై పరబోసి బీభత్సం సృష్టించారు. మహిళ జాకెట్‌ను చించి, చెప్పులతో కొడుతూ, కాలితో తన్నుతూ వీరంగం సృష్టించారు. దాడి ఘటనను చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మహిళ ఒంటిపై టవల్ కప్పి ఆమెను కాపాడారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకొని స్టేషన్‌కి తరలించారు. మహిళ ఫిర్యాదుతో ఏడుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags

Next Story