Visakhapatnam: రేసుల కోసం కాస్ట్‌లీ బైకుల దొంగతనం.. సీసీ కెమెరాలే సాక్ష్యం..

Visakhapatnam: విశాఖలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టయింది. బైక్ రేసర్లను కనిపెట్టే క్రమంలో ఈ బాగోతం బయటపడింది. 8 మందికి పైగా బైక్ దొంగలను క్రైం పోలీసులు గుర్తించగా.. అందులో ముగ్గురు బైక్ రేసర్లు ఉన్నారు. KTM, DUKE, R15, 220 బైక్‌లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు. అనంతరం పార్టులుగా తొలగించి OLX ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. ఫోన్ పే, గూగూల్ పేల ద్వారా చెల్లిస్తే బైక్ పార్టులను కొరియర్ ద్వారా డెలివరీ చేస్తున్నారు.
క్రేజీ బైక్స్ పార్టులు షోరూమ్‌లో అందుబాటులో లేకపోవడంతో వీరికి కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే బైక్ దొంగలను సీసీ కెమెరాలు పట్టించాయి. పోయిన బైక్ పార్ట్‌లు OLXలో ప్రత్యక్షమవడంతో పోలీసులు కంగుతిన్నారు. పోలీసులకు పట్టుబడిన బైక్ దొంగలంతా ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులే. క్రైం పోలీసులు.. చాకచక్యంగా నిఘా పెట్టి ముఠాను పట్టుకున్నారు. వీరి నుండి ఇప్పటికే 15కు పైగా బైకులను స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com