Bihar : పండగ పూట విషాదం.. : కల్తీ మద్యం తాగి 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి..!

X
By - /TV5 Digital Team |4 Nov 2021 4:30 PM IST
Bihar : బిహార్‌లో పండగ పూట విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలోని గోపాల్ గంజ్, చంపారన్ జిల్లాలో వరుస మరణాలు కలకలం రేపాయి.
Bihar : బిహార్‌లో పండగ పూట విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలోని గోపాల్ గంజ్, చంపారన్ జిల్లాలో వరుస మరణాలు కలకలం రేపాయి. రెండు జిలాల్లోని పలు గ్రామాల్లో 24 గంటల వ్యవధిలో 21 మంది చనిపోయారు. గోపాల్ గంజ్ జిల్లా కుషాహర్, మహ్మదాపూర్ గ్రామాల్లో నిన్న 13 మంది చనిపోగా...చంపారన్ జిల్లా బేతియా టౌన్ లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణాలకు కల్తీ మద్యమే కారణమని తెలుస్తోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చన్న సమాచారంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉండడంతో చాలా చోట్ల కల్తీ మద్యం తయారుచేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com