Banjara Hills: బంజారాహిల్స్‌లో రూ.100 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు యత్నం.. 62మంది అరెస్ట్..

Banjara Hills: బంజారాహిల్స్‌లో రూ.100 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు యత్నం.. 62మంది అరెస్ట్..
Banjara Hills: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఓ ముఠా హల్ చల్ చేసింది.

Banjara Hills: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఓ ముఠా హల్ చల్ చేసింది. వందకోట్ల విలువైన స్థలాన్ని కబ్జాకు యత్నించింది. అందులోని గేట్లను తొలగించి.. నిర్మాణాలను ధ్వంసం చేశారు. దాదాపు 90మంది కిరాయి గుండాలు ఈ దాడిలో పాల్గొన్నారు. తమ వెంట తెచ్చిన రెడీమెడ్ కంటైనర్‌ను ఆస్థలంలో పెట్టారు. అడ్డువచ్చిన సెక్యూరిటీ గార్డులపై మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు.

బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్ 10లో ఉన్న ఏపీ జెమ్స్‌ అండ్ జువెల్లరీస్ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఏపీకి చెందిన మాజీ ఎంపి టీజీ వెంకటేష్‌ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా అరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని 62మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 25మంది వరకు పరారైనట్లు తెలిపారు.

కర్నూలుకు చెందిన 90 మంది కిరాయి గుండాలు భూ కబ్జాలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 10లో సర్వే నెంబర్ 403లో రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్థలాన్ని ఏపీ జెమ్స్ అండ్ జువెల్లరీస్‌కు కేటాయించారు. ఆ స్థల నిర్వాహకులు ఒకటిన్నర స్థలంలో నిర్మాణాలను చేపట్టారు. మిగిలిన స్థలంలో పదిమంది సెక్యూరిటీని పెట్టారు.

పాతబస్తీకి చెందిన వీవీఆర్ శర్మ అనే అతను డాక్యుమెంట్లను చూపించి ఈ స్థలం తమదే అని అనడంతో దీనిపై .. బంజారాహిల్స్‌ పోలీస్టేషన్లో.. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. దీంతో మాజీ ఎంపి టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు విశ్వ ప్రసాద్ ఈ స్థలం విషయంపై ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి అతను నిర్మాణాలు చేపడుతుండగా.. అక్కడి సెక్యూరిటీ అడ్డుకుంటున్నారు. ఈ సారి ఏకంగా 90మందిని తీసుకొచ్చి అక్కడ గేట్లను తొలగించి నానా హంగామా చేశారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తప్పించుకున్నవారికోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story