శిరీష మర్డర్ కేసులో పోలీసుల కీలక నిర్ణయం

శిరీష మర్డర్ కేసులో పోలీసుల కీలక నిర్ణయం
శిరీష మృతదేహానికి రీపోస్టు మార్టం చేయాలని నిర్ణయించారు. రాత్రి పోస్టు మార్టం అనంతరం డెడ్‌బాడీ కుటుంబసభ్యులకు అప్పగించారు

తీవ్ర సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని శిరీష మర్డర్ కేసులో కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. శిరీష మృతదేహానికి రీపోస్టు మార్టం చేయాలని నిర్ణయించారు. రాత్రి పోస్టు మార్టం అనంతరం డెడ్‌బాడీ కుటుంబసభ్యులకు అప్పగించారు. తాజాగా హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. శిరీష డెడ్‌బాడీ పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రీ పోస్ట్ మార్టం కోసం పోలీసులు, డాక్టర్... యువతి ఇంటికి చేరుకున్నారు. అత్యాచారం జరిగిందా లేదా అనేది పరీక్షల్లో వైద్యులు నిర్ధారించనున్నారు. లేడి డాక్టర్ వైష్ణవి పరిగి నుంచి కాడ్లాపూర్‌కు వచ్చారు. యువతి అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో గొడవ జరిగితే యువతి తండ్రి పొంతనలేని సమాధానం చెప్తున్నాడు. మోకాళ్ళ లోతు నీటి కుంటలో ఆత్మహత్య ఎలా సాధ్యం?.. కుంటలోనే కంటికి గాయాలైతే తలపై రక్తం ఎందుకు గడ్డ కట్టింది...?.. అస్సలు ఇంట్లో గొడవలకు కారణాలేంటి...?.. ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story