వారికి న్యాయం జరిగింది.. మరి మాకేది న్యాయం: రాజు తల్లి

వారికి న్యాయం జరిగింది.. మరి మాకేది న్యాయం: రాజు తల్లి
సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు కథ ముగిసింది. అతని మృతదేహానికి వరంగల్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు.

సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు కథ ముగిసింది. అతని మృతదేహానికి వరంగల్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న రాజు డెడ్‌బాడీకి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో బంధువుల సమక్షంలో పోస్టు మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరంగల్‌ పోతన నగర్‌లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

మరోవైపు నిందితుడు రాజు కుటుంబీకులు మాత్రం రాజుని పోలీసులు హత్య చేశారు అంటూ ఆరోపిస్తున్నారు. రాజు మృతిపై అతని తల్లి షాకింగ్ కామెంట్స్ చేసింది. రాజుది ఆత్మహత్య కాదని, పోలీసులు చంపేశారని ఆరోపించింది. మూడు రోజుల కిందటే రాజు అడ్డ గూడూరులో పోలీసులకు దొరికిపోయాడని తెలిపింది.

ఇక ఇప్పుడేమో తమకు దొరకలేదని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారని వాపోయింది. పోలీసులే ఉరికించి రాజును కాల్చిచంపారు అంటూ అతని తల్లి ఆరోపించింది. ఆ బాలిక తల్లిదండ్రుల కడుపు కాలింది కాబట్టి రాజును చంపేసి న్యాయం చేశారు. ఇక ఇప్పుడు మాకు కూడా న్యాయం చేయండి అంటూ ఆమె కోరింది.

Tags

Read MoreRead Less
Next Story