Hyderabad: పబ్‌లో పోలీసుల తనిఖీలు.. అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు అరెస్ట్..

Hyderabad: పబ్‌లో పోలీసుల తనిఖీలు.. అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు అరెస్ట్..
Hyderabad: పోలీసులు ఎన్ని సార్లు దాడులు చేసి, కేసులు పెట్టినా.. కొన్ని పబ్‌ల తీరు ఏమాత్రం మారడంలేదు.

Hyderabad: హైదరాబాద్‌ పబ్బుల్లో గబ్బు సంస్కృతి మాత్రం వీడటంలేదు. పోలీసులు ఎన్ని సార్లు దాడులు చేసి, కేసులు పెట్టినా.. కొన్ని పబ్‌ల తీరు ఏమాత్రం మారడంలేదు. తాజాగా KPHBలోని క్లబ్‌ మస్తీ పబ్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో SOT పోలీసులు దాడులు చేశారు. అర్థనగ్న ప్రదర్శన చేస్తున్న 9 మంది యువతులతో పాటు పబ్‌ మేనేజర్‌ ప్రదీప్‌ సహా 15 మందిని అరెస్ట్‌ చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో డ్యాన్సులు చేయిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా.. మరిమితికి మించి డీజే సౌండ్స్‌తో పబ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీజే ఆపరేటర్‌ ధన్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పబ్‌ ఓనర్‌ శివప్రసాద్‌, మేనేజర్లు విష్ణు, క్రిషా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story