Preethi Case : డాక్టర్ నాగార్జునరెడ్డిపై బదిలీ వేటు

వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రీతిని వేధించిన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను మందలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఇటీవల ఎంజీఎంలో త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది.
కమిటీ నివేదిక ఆధారంగా అనస్థీషియా విభాగం హెచ్‌వోడీ డాక్టర్ నాగార్జునరెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన్ను భూపాలపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనస్థీషియా విభాగం హెచ్‌వోడీగా బదిలీ చేస్తూ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ప్రీతి కుటుంబ సభ్యులు, వివిధ ప్రజాసంఘాలు హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి తప్పిదంపైనే మొదటి నుండి ప్రశ్నిస్తున్నారు. నాగార్జునరెడ్డితోపాటు కేఎంసీ ప్రిన్సిపల్, ఎంజీఎం సూపరింటెండెంట్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com