ప్రేమించి పెళ్లిచేసుకుని ప్రేమికుల రోజునే ఆరునెలల గర్భిణి ఆత్మహత్య
ప్రేమించి పెళ్లిచేసుకుంది.. కానీ వరకట్న వేధింపులు ప్రేమికుల రోజునే నూరేళ్లు నిండేలా చేశాయి. పైగా.. ఆమె ఆరునెలల గర్భవతి కూడా కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
శోభ అనే 21 ఏళ్ల యువతి.. వరకట్న వేధింపులకు బలైపోయిన ఘటన అనంతపురం జిల్లా అమరాపురం మండలం నిద్రగట్ట గ్రామంలో జరిగింది. ప్రేమికుల దినోత్సవం రోజు ఈ ఘటన వెలుగు చూసింది. అప్పన్నగౌడ, ఉమాదేవి దంపతుల కుమార్తె అయిన శోభను.. పదిహేడేళ్ల వయసులో కర్నాటకలో ఉండే మేనమామకు ఇచ్చి పెళ్లి చేశారు. వారి మధ్య సఖ్యత లేకపోవడంతో.. నాలుగేళ్ల క్రితం శోభ తల్లిదండ్రుల వద్దకు వెనక్కి వచ్చింది.
ఆ తర్వాత.. మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించారు. వీరిద్దరికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం శోభ 6 నెలల గర్భవతి. అత్తింటివాళ్ల వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు.. సెల్ఫీ వీడియోలో శోభ తెలిపింది. తన ఆత్మహత్యకు భర్త, అత్త, మామ, తోడికోడళ్లు, బావ, మరిదిలు కారణమని శోభ చెప్పింది. కట్నం కోసం టార్చర్ పెట్టేవారని వీడియోతోపాటు సూసైడ్ నోట్‌లోనూ తెలిపి ప్రాణాలు తీసుకుంది శోభ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com