పెళ్లికి ముందే గర్భం.. పెట్రోల్ పోసిన తల్లి, అన్న..

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో గర్భిణికి తల్లి, సోదరుడు నిప్పంటించారు. 70 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మహిళ గర్భవతి అని కుటుంబ సభ్యులు గుర్తించడంతో, వారు ఆమెను అడవిలోకి లాక్కెళ్లి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఎలాగో తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది కానీ పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో 23 ఏళ్ల మహిళ గర్భవతి అని తేలినందుకు ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం చెందారు. కోపంతో ఊగిపోయారు. ఈ ఘటన నవాడ ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. అవివాహిత మహిళ అదే గ్రామానికి చెందిన యువకుడితో శారీరక సంబంధం పెట్టుకుని గర్భం దాల్చింది. విషయం కుటుంబ సభ్యులకు తెలవడంతో ఆగ్రహించారు.
సెప్టెంబరు 28, గురువారం మహిళ తల్లి, సోదరుడు ఆమెకు మాయ మాటలు చెప్పి సమీపంలోని అడవికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలి అరుపులు కేకలతో చుట్టుపక్కల ప్రాంతంలో నివసించే ప్రజలు ఆమెను ఆస్సత్రికి తరలించారు. పరిస్థితిక విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి తల్లి, సోదరుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (హాపూర్) రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com