pregnant woman Suicide: సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే గర్భిణి ఆత్మహత్య..

pregnant woman Suicide అమ్మ అవుతున్నానన్న ఆనందం ఆమెకు ఏమాత్రం లేదు.. అత్తమామల ఆరళ్లు ఆమెని ఆత్మహత్యకు పురిగొల్పాయి. నాలుగు నెలల గర్భిణి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.
గదగ్ జిల్లా గజేంద్ర గడకడ్డికి చెందిన లోకేష్ రాథోడ్ (27)కు ఏడాది క్రితం బాగల్ కోట జిల్లా ఇలకల్ తాలూకా చిక్క కోడలగి తండాకు చెందిన నిర్మలతో వివాహం జరిగింది. పెళ్లినాడు ఇస్తానన్న కట్నం ఇవ్వలేదని కోడల్ని రోజూ వేధించడం ప్రారంభించారు అత్తమామలతో పాటు భర్త కూడా.
కనీసం గర్భిణీ అని కూడా చూడకుండా చేయి చేసుకోవడంతో ఆమె మానసిక వేదన అనుభవించింది. బతికున్నా బాధలు తప్పవనుకుంది. అంతంత మాత్రమే ఉన్న తండ్రి సంపాదన తన సమస్యను తీర్చలేరనుకుంది. తల్లితండ్రి వచ్చి కూతుర్ని సీమంతం చేయడానికి తీసుకెళ్లాలనుకున్నారు.
ఉన్నంతలో కూతుర్ని బాగా చూసుకోవాలనుకున్నారు. అంతలోనే కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న గజేంద్రగడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com